పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : కట్టువడిన జరాసంధుని శ్రీకృష్ణుడు దయచే విదలి వుచ్చుట

డువేగ హరివచ్చి రుణమై నతని
విడిపించి యనిపిన వెలవెల నగుచు
సిహేతి హతశేషుగు వారుఁ దాను
లకఁ జనియె నమ్మగధభూవిభుఁడు
ముఁ జేకొని రామలజాక్షులంత
జయధ్వనులును సౌమగానములు
వందిమాగధభాగతసంఘనినద
మందంద మ్రోయఁగ మరేంద్రు లీల
పుము సొత్తెంచి యిమ్ముల రాజ్యభోగ
సౌఖ్యలీలల వ్రాలుచు నుండె
నాలో జరాసంధుఁ ఖిల బాంధవుల
నాలోచనము సేసి ప్పుడెంతయును
లువొంద నిరువదినాలుగక్షోహి
ణులుఁ గూర్చి మధుర మున్నుగ వచ్చి ముట్టి
లకఁ దొంటికైడి నొచ్చిపోయి
దునెనిమిదిమార్లు వరంబు సేసి
రితో జరాసంధుఁ డావహకేళిఁ
రిభవంబందుట రికించి చూచి.   - 590